నయీం అనుచరుడునని బెదిరిస్తుండటంతో కాల నీవాసులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బోడుప్పల్: పీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలోని శ్రీపురి కాలనీలో ఓ వ్యక్తి తాను నయీం అనుచరుడునని చెప్పుకుంటూ బెదిరిస్తుండటంతో కాల నీవాసులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... శ్రీపురి కాలనీ నివాసి ఉమర్ అన్సారీ(45) తాను గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడునని చెప్పుకుంటూ అదే కాలనీలో ఉండే 15 కుటుం బాలను మూడేళ్లుగా వేధిస్తున్నాడు. రోజూ తాగి వచ్చి దూషించడం, చిన్నపిల్లలతో సిగరెట్లు తెప్పించుకోవడం, మాట వినకపోతే కొట్టడం వంటివి చేస్తున్నాడు.
కిరాణా షాపుల్లో సిగరెట్లు, ఇతర వస్తువులు తీసుకొని డబ్బు చెల్లించేవాడు కాదు. ఎవరైనా డబ్బు అడిగితే చంపేస్తానని హెచ్చరించేవాడు. నయీం చనిపోయిన తర్వాత కూడా ఉమర్ అన్సారీ వేధింపులు ఆగకపోవడంతో కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. అంతేకాకుండా అన్సారీని పట్టుకొని బుధవారం రాత్రి పోలీసులకు అప్పగించారు. అయితే, రాత్రి అతడిని విడిచి పెట్టినట్టు తెలిసింది.