ఏలూరులో మజ్ను సందడి | majnu visit eluru | Sakshi
Sakshi News home page

ఏలూరులో మజ్ను సందడి

Oct 1 2016 10:05 PM | Updated on Sep 4 2017 3:48 PM

ఏలూరులో మజ్ను సందడి

ఏలూరులో మజ్ను సందడి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : సినీ నటుడు నాని నటించిన మజ్ను సినిమా విజయోత్సవ యాత్ర శనివారం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా సినిమా ప్రదర్శింంచబడుతున్న సత్యనారాయణ మినీ థియేటర్‌కు చిత్ర బందం ఉదయం ఆట సమయంలో చేరుకుంది.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : సినీ నటుడు నాని నటించిన మజ్ను సినిమా విజయోత్సవ యాత్ర శనివారం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా సినిమా ప్రదర్శింంచబడుతున్న సత్యనారాయణ మినీ థియేటర్‌కు చిత్ర బందం ఉదయం ఆట సమయంలో చేరుకుంది. అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ తన చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కతజ్ఞతలు తెలిపారు. ఏలూరు నగరంతో తనకు అవినాభావ సంబంధముందన్నారు. తన సినిమాలను ఎక్కువగా ఆదరించేది ఏలూరు ప్రేక్షకులేనని, ఇక్కడకు వస్తే తాను సొంత ఊరికి వచ్చినట్టు అనుభూతి చెందుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత గోళ్ల గీత, దర్శకుడు విరించి వర్మ, హీరోయిన్‌ అను ఇమ్మానియేల్, మాటల రచయిత కిరణ్, పాటల రచయిత రాంబాబు, పంపిణీదారుడు ఎల్‌వీఆర్, థియేటర్‌ మేనేజర్‌ రాము తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement