పెళ్లి కోసం ప్రియురాలి పోరాటం | lover against her boy friend in gangadevipalli | Sakshi
Sakshi News home page

పెళ్లి కోసం ప్రియురాలి పోరాటం

Oct 8 2016 8:32 AM | Updated on Sep 4 2017 4:32 PM

పెళ్లి కోసం ప్రియురాలి పోరాటం

పెళ్లి కోసం ప్రియురాలి పోరాటం

తెలంగాణ యువతి పెళ్లి కోసం తను ప్రేమించిన ఆంధ్రప్రదేశ్‌ యువకుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగింది.

ప్రియుడి ఇంటి ముందు ఆందోళన
బాధితురాలిది నల్లగొండ జిల్లా రెడ్డిగూడెం


తాడిపత్రి రూరల్‌(అనంతపురం) : తెలంగాణ యువతి పెళ్లి కోసం తను ప్రేమించిన ఆంధ్రప్రదేశ్‌ యువకుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. వివరాల్లోకెళితే.. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గంగాదేవిపల్లికి చెందిన చంద్రకాంత్‌రెడ్డి బీటెక్‌ చదివాడు. ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాడు. ఆ సమయంలో అదనపు కోర్సు కోసం శిక్షణ కేంద్రానికి వెళ్లాడు. ఎంబీఏ చదివిన నల్లగొండ జిల్లా రెడ్డిగూడెంకు చెందిన చైతన్య అనే యువతి కూడా అదే కేంద్రంలో శిక్షణ తీసుకుంటోంది. అలా ఏర్పడిన వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది.

మూడు నెలల నుంచి చంద్రకాంత్‌రెడ్డి చైతన్యతో మాట్లాడటం మానేశాడు. కనిపించకుండా తిరుగుతున్నాడు. ఆఖరికి ఫోన్‌కూడా రిసీవ్‌ చేసుకోవడం లేదు. దీంతో చైతన్య శుక్రవారం గంగాదేవిపల్లికి చేరుకుంది. ఆ సమయంలో ప్రియుడు గ్రామంలో లేడు. దీంతో ఆమె ప్రియుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. చంద్రకాంత్‌రెడ్డికి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో.. మా ఇంటి ముందుకు ఎందుకు వచ్చావు అంటూ చైతన్యతో చంద్రకాంత్‌ కుటుంబసభ్యులు మండిపడ్దారు. తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చేంతవరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆమె భీష్మించింది. ఈ విషయంపై బాధితురాలి నుంచి ఎటువంటి ఫిర్యాదూ అందలేదని రూరల్‌ ఎస్‌ఐ నారాయణరెడ్డి పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement