పంట బోదెలోకి దూసుకెళ్లిన లారీ | lorry fell in to canal | Sakshi
Sakshi News home page

పంట బోదెలోకి దూసుకెళ్లిన లారీ

Aug 5 2016 11:10 PM | Updated on Sep 4 2017 7:59 AM

నల్లాకులవారిపాలెం(పెరవలి) : వేగంగా వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి పంటబోదెలోకి దూసుకెళ్లింది. ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.

నల్లాకులవారిపాలెం(పెరవలి) : వేగంగా వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి పంటబోదెలోకి దూసుకెళ్లింది. ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం పెరవలి మండలం నల్లాకులవారిపాలెం వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రావులపాలెం నుంచి తణుకువైపు వస్తున్న లారీ నల్లాకులవారిపాలెం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వస్తుండగా,  ఎదురుగా రాంగ్‌రూట్‌లో వచ్చిన మరో వ్యాన్‌ కటింగ్‌ వద్ద హఠాత్తుగా మలుపు తిరిగింది. దీంతో ఒక్కసారిగా వేగాన్ని లారీ డ్రై వర్‌ నియంత్రించలేకపోయాడు. ఫలితంగా అది పక్కనే ఉన్న పంట బోదెలోకి దూసుకెళ్లింది. లారీని బోదెలోకి మళ్లించకపోతే లారీ మనుషులపై నుంచి వెళ్లిపోయేదని స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. వారి వివరాలు తెలియరాలేదు.  
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement