రాళ్ల లోడు లారీ ఢీకొనడంతో సుజికి ఏక్టివాపై వెళుతోన్న ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడితోపాటు ఏక్టివాపై ఉన్న మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాద సంఘటన వద్ద ఉన్న, రెండు కోడిపుంజులు, ఏక్టివాకు ఉన్న క్యారీ బ్యాగ్‌పై రక్తపు మరకలు
లారీ ఢీ : స్కూటరిస్టు మృతి
Jan 16 2017 10:09 PM | Updated on Sep 5 2017 1:21 AM
రంగంపేట (అనపర్తి నియోజకవర్గం) :
రాళ్ల లోడు లారీ ఢీకొనడంతో సుజికి ఏక్టివాపై వెళుతోన్న ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడితోపాటు ఏక్టివాపై ఉన్న మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాద సంఘటన వద్ద ఉన్న, రెండు కోడిపుంజులు, ఏక్టివాకు ఉన్న క్యారీ బ్యాగ్‌పై రక్తపు మరకలు ఉండడంతో వారు కోడిపందేల నుంచి వస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. పెద్దాపురం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న సుజికి ఏక్టివాపై వెళుతున్న ముగ్గురిని రాజానగరం వైపు నుంచి పెద్దాపురం వైపు వెళ్లే రాళ్లు లోడు లారీ ఢీకొట్టింది. సోమవారం సాయంత్రం రంగంపేట–వడిశలేరు మధ్య దుర్గమ్మగుడి సమీపంలో ఏడీబీ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో అప్పలస్వామి (35) అక్కడికక్కడే మృతి చెందాడు. ధవళేశ్వరానికి చెందిన అప్పలస్వామితోపాటు గంట విక్రమ్, దొమ్మ మరిడియ్య పెద్దాపురం వైపు నుంచి ధవళేశ్వరం సుజుకిపై వెళుతున్నారు. విక్రమ్‌కు తీవ్ర గాయం కాగా, మరిడయ్య స్వల్ప గాయంతో బయటపడ్డాడు. ప్రమాద సంఘటనకు సమీపంలో రెండు కోడిపుంజులను పోలీసులు కనుగొన్నారు. వాటి కాళ్లకు తాడు కట్టి ఉంది. ఒక కోడిపుంజు గాయాలతో కదలలేని పరిస్థితిలో ఉంది. మరో పుంజుకు గాయాలు తగలకపోయినా, కాళ్ల కట్టిన తాడు రాయికి మెలిక పడడంతో కదలకుండా ఉండిపోయింది. క్షతగాత్రులను రాజానగరం జీఎస్‌ఎల్‌కు తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు పెట్రోలింగ్ ఏఎస్సై పీడీసీహెచ్ రాజు సహకరించారు. మృతి చెందిన అప్పలస్వామి మృతదేహానికి పంచనామా నిర్వహించి పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎ¯ŒS.సన్యాసి నాయుడు తెలిపారు.చెప్పారు.
Advertisement
Advertisement