పండిట్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు 26న తుది గడువు | last date 26th of pandit exam fee | Sakshi
Sakshi News home page

పండిట్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు 26న తుది గడువు

Oct 19 2016 10:43 PM | Updated on Sep 4 2017 5:42 PM

తెలుగు, హిందీ పండిట్‌ 2015–16 బ్యాచ్‌ విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 26లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాధికారి అంజయ్య, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందనాయక్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : తెలుగు, హిందీ పండిట్‌ 2015–16  బ్యాచ్‌ విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 26లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాధికారి అంజయ్య, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందనాయక్‌  బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 28న సంబంధిత ట్రెజరీ ద్వారా ఫీజు మొత్తాన్ని బ్యాంకుల్లో చెల్లించాలని ప్రధానాచార్యులకు సూచించారు. అలాగే రూ. 50 అపరాధ రుసుంతో నవంబర్‌ 5 వరకు విద్యార్థులు ఫీజు చెల్లించొచ్చని,  7న ట్రెజరీ ద్వారా బ్యాంకుల్లో చెల్లించాల్సి ఉంటుందన్నారు.

నామినల్‌ రోల్స్, ఇతర ధ్రువపత్రాలు నేరుగా ప్రభుత్వ పరీక్షల విభాగం హైదరాబాద్‌ వారికి నవంబర్‌ 11న అందజేయాలన్నారు. రెగ్యులర్‌ విద్యార్థులు రూ. 150, ఫెయిల్‌ అయిన విద్యార్థులు మూడు సబ్జెక్టులకంటే తక్కువగా ఉంటే రూ. 100, అంతకంటే ఎక్కువగా ఉంటే రూ. 150 చెల్లించాలన్నారు. ఇతర వివరాలకు ఠీఠీఠీ.bట్ఛ్చp.ౌటజ. వెబ్‌సైట్‌ పరిశీలించాలని సూచించారు.

Advertisement

పోల్

Advertisement