కలెక్టరేట్ ను ముట్టడించిన భూనిర్వాసితులు | lands expats dharna at collectorate | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్ ను ముట్టడించిన భూనిర్వాసితులు

Jul 25 2016 4:30 PM | Updated on Sep 4 2017 6:14 AM

గౌరవెల్లి, గండిపల్లి భూనిర్వాసితులు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు.

కరీంనగర్: గౌరవెల్లి, గండిపల్లి భూనిర్వాసితులు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. సీపీఐ ఆధ్వర్యంలో నిర్వాసితులు కలెక్టరేట్ వద్ద బైఠాయించి వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిర్వాసితులు లోపలి వెళ్లుందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగి పలువురు కిందపడిపోవడంతో స్వల్పగాయాలయ్యాయి. సీపీఐ నాయకులతో పాటు నిర్వాసితులను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా కొందరు వాహనంపైకి ఎక్కి ఆందోళనకు దిగారు. ఆందోనకారుల్ని పోలీసులు చెదరగొట్టారు. అరెస్ట్‌లు, పోలీసుల నిర్భంధంతో ఉద్యమం ఆగదని, 123 జీవో రద్దు చేసి 2013 భూసేకరణ చట్టప్రకారం పరిహారం చెల్లించే వరకు గౌరవెళ్లి, గండిపల్లి రిజర్వాయర్‌ల నిర్మాణం అడ్డుకుంటామని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement