తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు.
వరంగల్ : తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. పట్టణంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేయడం అనేది సీఎం బలహీనతని, కేసీఆర్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
టీడీపీ, బీజేపీ నేతలు వరంగల్ జిల్లాలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. హన్మకొండ నుంచి ఆత్మకూరు వరకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర రైతుల కోసం తాము తలపెట్టిన బంద్ను విజయవంతం చేసి తీరుతామని రమణ పేర్కొన్నారు.