నూతనంగా కర్నూలు అర్బన్‌ మండలం | kurnool urban mandal declared | Sakshi
Sakshi News home page

నూతనంగా కర్నూలు అర్బన్‌ మండలం

Nov 12 2016 9:45 PM | Updated on Sep 4 2017 7:55 PM

కొన్నేళ్లుగా ఊరిస్తున్న కర్నూలు అర్బన్‌ మండలం కల సాకారం అయింది.

కర్నూలు(అగ్రికల్చర్‌): కొన్నేళ్లుగా ఊరిస్తున్న కర్నూలు అర్బన్‌ మండలం కల సాకారం అయింది. జిల్లాలో కర్నూలు, కల్లూరు, నంద్యాల, ఆదోని అర్బన్‌ మండలాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం కర్నూలు అర్బన్‌ మండలం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి మెమో కూడా జారీ చేసింది. గతంలోనే సీసీఎల్‌ఏ అనిల్‌చంద్ర పునీట కర్నూలు అర్బన్‌ మండలం ఏర్పటు చేస్తున్నట్లుగా వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రకటించారు. తాజాగా ప్రభుత్వం కర్నూలు అర్బన్‌ మండలం ఏర్పాటుకు మెమో ఇచ్చింది. తర్వాత జీవో విడుదల చేయాల్సి ఉంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement