
కేసీఆర్ తప్పు చేశారు: కోమటిరెడ్డి
ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం ఫైర్ అయ్యారు.
నల్లగొండ:
ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం ఫైర్ అయ్యారు. పుష్కరాల తర్వాత రాజీనామా చేస్తానని గుత్తా చెప్పడం అభినందనీయం అని కోమటిరెడ్డి అన్నారు. గుత్తా తిరిగి పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కదన్నారు. పుష్కరాల తర్వాత కాంగ్రెస్కు మంచి రోజులు రానున్నాయన్నారు. ఐరన్లెగ్ లాంటి గుత్తాను పార్టీలో చేర్చుకుని కేసీఆర్ తప్పు చేశారని కోమటి రెడ్డి తెలిపారు.