కిరణ్‌కుమార్‌కు గురజాడ పురస్కారం | kirankumar selected the gurajada award | Sakshi
Sakshi News home page

కిరణ్‌కుమార్‌కు గురజాడ పురస్కారం

Sep 19 2016 11:12 PM | Updated on Sep 4 2017 2:08 PM

తిమ్మాపూర్‌ పరిధిలోని బాకూర్‌పల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చుక్క కిరణ్‌కుమార్‌ రాష్ట్రస్థాయి గురజాడ తెలుగు కవితా పురస్కారం అందుకున్నారు.

ఎల్లారెడ్డిపేట:  తిమ్మాపూర్‌ పరిధిలోని బాకూర్‌పల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చుక్క కిరణ్‌కుమార్‌ రాష్ట్రస్థాయి గురజాడ తెలుగు కవితా పురస్కారం అందుకున్నారు. గొల్లపల్లి మండలం మల్లన్నపేటకు చెందిన కిరణ్‌కుమార్‌ సాహిత్యం, చిత్రలేఖనంతోపాటు 10వేల మంది కవులతో ప్రారంభమైన ప్రయూత కవితాయజ్ఞంలో 100కు పైగా పద్యాలు రాసి సహస్త్ర కవిమిత్ర బిరుదును సాధించారు. బాలలకు గుడి.. బాకూర్‌పల్లి బడియే.. అనే శతకంతోపాటు అనేక కవితలు సాహిత్యంతో యూఎస్‌ఏ ఫౌండేషన్‌ రాష్ట్రస్థాయి గురజాడ తెలుగు కవితా పురస్కారం 2016కు కిరణ్‌కుమార్‌ను ఎంపిక చేసింది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో గురజాడ అమెరికా సంస్థ ఆధ్వర్యంలో అవార్డును అందించారు. భవిష్యత్తులో మరిన్ని కవితలు, పద్యాలు, సాహిత్యం, చిత్రలేఖనంతో కిరణ్‌కుమార్‌ రాణించాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement