తనకు తానే కి డ్నాపయ్యాడు.. | kidnapping drama in Anantapur | Sakshi
Sakshi News home page

తనకు తానే కి డ్నాపయ్యాడు..

May 31 2016 11:55 AM | Updated on Jun 1 2018 8:39 PM

కలకలం రేపిన అనంతపురం జిల్లా ధర్మవరం మరమగ్గాల వ్యాపారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు.

కలకలం రేపిన అనంతపురం జిల్లా ధర్మవరం మరమగ్గాల వ్యాపారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. వివరాలివీ.. పట్టణానికి చెందిన రామాంజనేయులును గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ చేసి బంధించారు. అతడు బందీగా ఉన్న ఫొటో ఫోన్‌లో వాట్సాప్ ద్వారా కుటుంబసభ్యులకు అందింది. వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు...అది కట్టుకథగా తేల్చారు.

 

చివరికి రామాంజనేయులు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. భార్య తండ్రి నుంచి నుంచి డబ్బులు వసూలు చేయటానికే ఈ మేరకు కిడ్నాప్ డ్రామా ఆడినట్లు అంగీకరించాడు. మంగళవారం సాయంత్రం జరిగే సమావేశంలో పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement