శ్రీ మఠంలో కర్ణాటక హైకోర్టు జడ్జి | karnataka highcourt justice at srimatham | Sakshi
Sakshi News home page

శ్రీ మఠంలో కర్ణాటక హైకోర్టు జడ్జి

Sep 4 2016 12:35 AM | Updated on Aug 31 2018 9:15 PM

శ్రీ మఠంలో కర్ణాటక హైకోర్టు జడ్జి - Sakshi

శ్రీ మఠంలో కర్ణాటక హైకోర్టు జడ్జి

శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనార్థం కర్ణాటక హైకోర్టు జడ్జి ఆర్‌బి.బుదిహల్‌ శనివారం మంత్రాలయం చేరుకున్నారు.

 శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనార్థం కర్ణాటక హైకోర్టు జడ్జి ఆర్‌బి.బుదిహల్‌ శనివారం మంత్రాలయం చేరుకున్నారు. ఆయన ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూల బందావనంను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ మఠం పీఠాధిపతి సుభుధేంద్రతీర్థులు శేషవస్త్రం, స్వామివారి మెమొంటో, ఫలమంత్రాక్షితలిచ్చి ఆశీర్వదించారు. అంతకు ముందు శ్రీ మఠం మేనేజర్‌ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, అసిస్టెంట్‌ పీఆర్వో వ్యాసరాజాచార్‌ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. 
– మంత్రాలయం  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement