బతుకమ్మ కుంటలో కార్డన్‌సెర్చ్‌ | kardanserc | Sakshi
Sakshi News home page

బతుకమ్మ కుంటలో కార్డన్‌సెర్చ్‌

Jul 30 2016 10:07 PM | Updated on Sep 4 2017 7:04 AM

బతుకమ్మ కుంటలో కార్డన్‌సెర్చ్‌

బతుకమ్మ కుంటలో కార్డన్‌సెర్చ్‌

పట్టణంలోని బతుకమ్మ కుంట కాలనీని శనివారం ఉదయం పోలీసులు చుట్టుముట్టి ఇంటింటా సోదాలు చేశారు.

కామారెడ్డి : పట్టణంలోని బతుకమ్మ కుంట కాలనీని శనివారం ఉదయం పోలీసులు చుట్టుముట్టి ఇంటింటా సోదాలు చేశారు. కార్డన్‌సెర్చ్‌లో భాగంగా పట్టణ సీఐ శ్రీనివాస్‌రావు, ఎస్సైలు శోభన్‌బాబు, శోభన్‌లు సిబ్బందితో కాలనీలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి పత్రాలు లేని 29 బైక్‌లు, ఆరు ఆటోలను పోలీసులు సీజ్‌ చేశారు. అలాగే ఎనిమిది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇటీవల బతుకమ్మ కుంట కాలనీలో జరిగిన గొడవలో తల్వార్‌తో ఇద్దరు కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై దాడి చేసి గాయపర్చారు. కాలనీలో అసాంఘిక శక్తులు ప్రవేశించాయని అనుమానిస్తున్న పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించి ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement
Advertisement