'పోలీసులే రెచ్చగొట్టారు' | Kapu Agitators allegations on Police | Sakshi
Sakshi News home page

'పోలీసులే రెచ్చగొట్టారు'

Jan 31 2016 7:14 PM | Updated on Jul 30 2018 6:29 PM

'పోలీసులే రెచ్చగొట్టారు' - Sakshi

'పోలీసులే రెచ్చగొట్టారు'

పోలీసుల వల్లే తమ కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారిందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు.

తుని: పోలీసుల వల్లే తమ కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారిందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. రాస్తారోకో చేస్తున్న తమపై పోలీసులు లాఠీచార్జి చేశారని చెప్పారు. తర్వాత తమపై రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారని తెలిపారు. ఈ కవ్వింపు చర్యల వల్లే చాలా మంది రెచ్చిపోయారని ఆందోళనకారులు వెల్లడించారు.

తుని రూరల్  పోలీస్ స్టేషన్ పై ఆందోళన కారులు దాడి చేశారు. స్టేషన్ ప్రాంగణంలో 8 వాహనాలకు నిప్పుపెట్టారు. మరోవైపు కాపుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో తునికి అదనంగా పోలీసు బలగాలు తరలిస్తున్నారు. ఆందోళనకారులు భారీ సంఖ్యలో బైఠాయించడంతో జాతీయ రహదారిపై ఉద్రిక్తత కొనసాగుతోంది. అయితే పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవరించారని డీజీపీ జేవీ రాముడు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement