రెండు నెలలపాటు విజయవాడలో కంచి పరమాచార్య | Kanchi paramacarya live in Vijayawada for two months | Sakshi
Sakshi News home page

రెండు నెలలపాటు విజయవాడలో కంచి పరమాచార్య

Jul 10 2016 8:03 PM | Updated on Sep 4 2017 4:33 AM

కంచిపరమాచార్యులు జయేంద్ర సరస్వతీ మహాస్వామి వార్షిక చాతుర్మాస దీక్షలో భాగంగా ఈనెల 19 వ తేదీ నుంచి రెండు నెలల పాటు విజయవాడలో విడిదిచేయనున్నారు.

కంచిపరమాచార్యులు జయేంద్ర సరస్వతీ మహాస్వామి వార్షిక చాతుర్మాస దీక్షలో భాగంగా ఈనెల 19 వ తేదీ నుంచి రెండు నెలల పాటు విజయవాడలో విడిదిచేయనున్నారు. ఇందుకు మాగంటి సుబ్రహ్మణ్యం చైర్మన్‌గా ఉన్న శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయ పాలక మండలి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

దీక్షా కాలంలో ప్రతీ రోజూ వేద సభలు, సంగీత సాహిత్య సభలు నిర్వహించనున్నారు. జూలై 22వ తేదీ కంచి స్వామి 82 సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నారు. జయంతి వేడుకల కోసం భక్తులు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించనున్నారు. సెప్టెంబరు 16 తో చాతుర్మాస దీక్ష ముగుస్తుంది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement