జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 21న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ప్రతాపరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
21న నిరుద్యోగులకు జాబ్‌మేళా
Apr 20 2017 12:36 AM | Updated on Sep 5 2017 9:11 AM
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 21న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ప్రతాపరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు మాన్యుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఎంపికైన వారికి హైదరాబాద్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ, భోజన వసతి కల్పిస్తారన్నారు. అభ్యర్థులు 18 నుంచి 21 ఏళ్లలోపు వయస్సు కలిగి, ఇంటర్(బైపీసీ/ఎంపీసీ) లేదా డిగ్రీ ఫెయిల్, డిస్కంటిన్యూ చేసి ఉండాలన్నారు. ఎంపికైన వారు హైదరాబాద్, విశాఖపట్టణంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు.
Advertisement
Advertisement