నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జాబ్‌ మేళాలు | job oppurtunities through skill development | Sakshi
Sakshi News home page

నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జాబ్‌ మేళాలు

Sep 30 2016 10:17 PM | Updated on Nov 6 2018 5:08 PM

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నిరుద్యోగుల కోసం మరిన్ని ఉద్యోగ మేళాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్‌ బి.ఉదయలక్ష్మి అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గోలి నితిన్‌రెడ్డి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మించిన కళావేదికను ఉదయలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు.

చింతలపూడి : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నిరుద్యోగుల కోసం మరిన్ని ఉద్యోగ మేళాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్‌ బి.ఉదయలక్ష్మి అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గోలి నితిన్‌రెడ్డి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మించిన కళావేదికను   ఉదయలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెలగా జోషి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఇంగ్లిష్‌ భాషలో పట్టు సాధించాలని, సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న కళాశాలలను పటిష్ట పరిచి విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు చెప్పారు. కళాశాల అభివద్ధికి సహకరిస్తున్న సీపీడీసీ కమిటీని అభినందించారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ జిల్లా గవర్నర్‌ సత్యన్నారాయణ, వైస్‌ జిల్లా గవర్నర్‌ కేవీ కిషోర్‌కుమార్, డీసీ చిల్లపల్లి మోహన్‌రావు, చింతలపూడి లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు సయ్యద్‌ ఖాజా మొయినుద్దీన్‌ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement