జేఎన్‌టీయూ అనంతపురం సంబంధించిన వివరాలన్నీ సెల్‌ఫోన్‌లోనే తెలుసుకునే విధంగా కళాశాల విద్యార్థులు యాప్‌ను తయారు చేసి ఆవిష్కరించినట్లు ప్రిన్సిపాల్ ఆచార్య ప్రహ్లాదరావు తెలిపారు.
జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ అనంతపురం సంబంధించిన వివరాలన్నీ సెల్‌ఫోన్‌లోనే తెలుసుకునే విధంగా కళాశాల విద్యార్థులు యాప్‌ను తయారు చేసి ఆవిష్కరించినట్లు ప్రిన్సిపాల్ ఆచార్య ప్రహ్లాదరావు తెలిపారు. కళాశాలకు సంబంధించిన వివరాలు నోటీసు బోర్డులో పేర్కొనే అవసరం లేకుండా ఈ యాప్ దోహదపడుతుందన్నారు. విభాగాల పరీక్షల తేదీలు, సదస్సుల వివరాలు తదితర అంశాలన్నీ నేరుగా విద్యార్థులకు, అధ్యాపకులకు, బోధనేతర ఉద్యోగుల మొబైల్ ఫోన్‌లకు సమాచారం అందుతుందన్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా పనిచేసే ఈ యాప్‌ను స్టూడెంట్ యూనియన్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులు, ఇంజనీరింగ్ ఈసీఈ మూడవ సంవత్సరం విద్యార్థి సీహెచ్ విహారి వర్మ అభివద్ధి చేశారని వెల్లడించారు.