జేడీఏగా విజయనిర్మలకు పూర్తి బాధ్యతలు | jda full charge to vijayanirmala | Sakshi
Sakshi News home page

జేడీఏగా విజయనిర్మలకు పూర్తి బాధ్యతలు

Aug 17 2016 10:18 PM | Updated on Sep 4 2017 9:41 AM

జేడీఏగా విజయనిర్మలకు పూర్తి బాధ్యతలు

జేడీఏగా విజయనిర్మలకు పూర్తి బాధ్యతలు

జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులుగా ముండ్లపాటి విజయనిర్మలకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఖమ్మం: జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులుగా ముండ్లపాటి విజయనిర్మలకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ఫిబ్రవరిలో ఇదే కార్యాలయంలోని రైతు శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్న సహాయ వ్యవసాయ సంచాలకురాలు పి.మణిమాలకు జేడీఏగా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇన్‌చార్జ్‌  బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఈ శాఖలో రాష్ట్రస్థాయిలో ఉపసంచాలకుల వరకు పదోన్నతులు కల్పించారు.

దీంతో మన జిల్లాకు రెండు ఉపసంచాలకుల పదవులు భర్తీ అయ్యాయి. జేడీఏ కార్యాలయ ఉపసంచాలకులుగా విజయనిర్మలకు అవకాశం దక్కింది.   దీంతో విజయనిర్మలకు జేడీఏగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ  పార్థసారధి ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో మణిమాల నుంచి జేడీఏ బాధ్యతలను విజయనిర్మల తీసుకున్నారు. మణిమాల ఏడీఏగా తిరిగి తన విభాగంలోకి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement