
'వెంకయ్య, చంద్రబాబు కావాలంటే పెంచుకోగలరు'
కుమారుడు లోకేష్ను మంత్రిని చేయడం ఆయన తండ్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఇష్టమని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అన్నారు.
విజయవాడ : కుమారుడు లోకేష్ను మంత్రిని చేయడం ఆయన తండ్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఇష్టమని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అన్నారు. బుధవారం విజయవాడలో లోకేష్ కోసం తమ పదవులు త్యాగం చేస్తానంటూ ప్రకటిస్తున్న ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యలపై జేసీ స్పందించారు. లోకేష్ కోసం రాజీనామాలు చేస్తామనడం అంతా మెహర్భానీ మాటలు అని జేసీ అభివర్ణించారు. కులసంఘం తీర్మానించిందని లోకేష్ను మంత్రిని చేయడం కాదని ఆయన అన్నారు.
అయినా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో చంద్రబాబుకు తెలుసునని జేసీ దివాకర్రెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నియోజకవర్గాలను పెంచడానికి వీల్లేదన్నారు. కానీ కేంద్రమంత్రి వెంకయ్య, సీఎం చంద్రబాబు కావాలంటే పెంచుకోగలరని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు కానీ.... ఎమ్మెల్యే సీట్లు మాత్రం పెంచగలరు అని జేసీ దివాకర్రెడ్డి వ్యంగ్యంగా అన్నారు.