గుంటూరు నగరం మంగళదాస్‌నగర్ ప్రాంతంలోని వివిధ వ్యాపారవేత్తల గృహాలు, వాణిజ్య సముదాయాలపై ఐటీ అధికారులు మూడు రోజులుగా దాడులు చేస్తున్నారని సమాచారం.
వ్యాపారవేత్తల ఇళ్లపై ఐటీ దాడులు
Sep 26 2016 10:12 PM | Updated on Sep 27 2018 4:02 PM
పాత గుంటూరు: గుంటూరు నగరం మంగళదాస్‌నగర్ ప్రాంతంలోని వివిధ వ్యాపారవేత్తల గృహాలు, వాణిజ్య సముదాయాలపై ఐటీ అధికారులు మూడు రోజులుగా దాడులు చేస్తున్నారని సమాచారం. విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారిలో వ్యాపారవేత్తలు సుమారు రూ. 400 కోట్లతో నూతన షాపింగ్ కాంప్లెక్సు, ఇతర భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ మేరకు ఐటీ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 5 కోట్ల నగదుతోపాటు, 20 మంది వ్యాపారవేత్తలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మంగళవారం కూడా విచారణ కొనసాగనున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement