బోగస్ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలపై ఉద్యోగాలు చేస్తున్నారనే ఆరోపణలపై వివిధ శాఖల్లోని ఐదు గురి సర్టిఫికెట్లను జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్ మంగళవారం పరిశీలించారు.
బోగస్ కుల ధ్రువీకరణ పత్రాలపై విచారణ
Jun 13 2017 11:23 PM | Updated on Apr 3 2019 5:51 PM
కర్నూలు(అగ్రికల్చర్): బోగస్ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలపై ఉద్యోగాలు చేస్తున్నారనే ఆరోపణలపై వివిధ శాఖల్లోని ఐదు గురి సర్టిఫికెట్లను జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్ మంగళవారం పరిశీలించారు. సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పని చేస్తున్న ఉపేంద్ర, బీఎస్‌ఎన్‌లో పని చేస్తున్న మద్దిలేటి, పెద్దాసుపత్రిలో పని చేస్తున్న కొండయ్య, సవారన్న, వెంకటస్వామిలు బుడగ జంగాల కులానికి చెందిన వారైతే లింగదారికోయ సర్టిఫికెట్‌తో ఉద్యోగాలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. వీటిపై జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్‌ఓ విచారణ జరిపారు. అయితే తమ కులాలను నిరూపించుకునేందుకు మరికొంత సమయం కావాలని కోరడంతో విచారణను వాయిదా వేశారు. కాగా మాదాసి కురువ, మాదాసి కురుమ కుల ధ్రువీకరణ పత్రాల జారీపై కూడా డీఆర్‌ఓ విచారణ జరిపారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్‌డీఓ ఉసేన్‌సాహెబ్, తహసీల్దార్ రమేష్‌బాబు, సి.సెక‌్షన్ సూపరింటెండెంట్ రామాంజనమ్మ, జిల్లా స్థాయి స్క్రూటిని కమిటీ సభ్యులు, గిరిజన ఉద్యోగ సంఘం అధ్యక్షుడు బి.మద్దిలేటి, చైర్మన్ బద్దూనాయక్, ఉపాధ్యక్షుడు మద్దయ్య, గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement