భక్తుల పాదయాత్ర

భక్తుల పాదయాత్ర


న్యాల్‌కల్‌: కర్ణాటక, మహారాష్ట్రాలకు చెందిన వందలాది మంది భక్తులు ఆదివారం భజనలు చేసుకుంటూ పాదయాత్రగా మండల కేంద్రమైన ఝరాసంగం కేతకి ఆలయానికి వెళ్ళారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, తాము కోరిన కోర్కెలు తీరాలని కోరుతూ ప్రతిఏటా పాదయాత్రతో వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారు. అందులో భాగంగా కర్నాటక, మహారాష్ట్రాలలోని అనేగావ్, నెట్టూరు, కోడ్గా, బరూర్, తాండ, అల్లిపుర్గి, జైనాపూర్‌ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆదివారం న్యాల్‌కల్‌ మండలంలోని మల్గి, డప్పూర్, అత్నూర్, న్యాల్‌కల్, రుక్మాపూర్‌ల మీదుగా  కేతకి సంగమేశ్వర ఆలయానికి తరలివెళ్లారు. భజనలు, నృత్యాలు చేస్తూ ఆయా గ్రామాల గుండా పాద యాత్రను కొనసాగించారు. నాలుగు రోజుల క్రితం పాదయాత్రగా బయలు దేరామని ఆదివారం రాత్రి ఆలయానికి చేరుకొని భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.  



భక్తులకు అన్నదాన కార్యక్రమం

 పాదయాత్రన తరలి వెళున్న భక్తులకు అత్నూర్‌ గ్రామానికి చెందిన తుకారం పాటిల్-పరాగ్‌బాయి, బాబురావు-సుమిత్రబాయి దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. కేతకీ ఆలయానికి వెళ్లే భక్తులకు ప్రతి ఏటా అన్నాదానం నిర్వహిస్తున్నారు. అనంతరం న్యాల్‌కల్‌ మీదుగా ముంగి వైపు వస్తున్న భక్తులకు ముంగి చౌరస్తా వద్ద పలువురు భక్తులకు టీ, బిస్కెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రవీదర్‌, నాయకులు ఎల్‌చల్‌ నర్సింహారెడ్డి, రాజు పాటిల్, శివాజీ పాటిల్, విజయ్‌ పాటిల్, విఠల్‌రెడ్డి, ఏక్‌నాథ్‌, దండేమహారాజ్‌, వీరారెడ్డి, న్యాల్‌కల్‌ శ్రీను సేఠ్‌ తదితరులు పాల్గొన్నారు.

--------------

14జడ్‌హెచ్‌ఆర్‌41:న్యాల్‌కల్‌ మీదుగా ఝరాసంగంకు పాద యాత్రన తరలి వెళ్లుతున్న భక్తులు

 



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top