హాకీ శిక్షణ శిబిరం ప్రారంభం | hockey training start | Sakshi
Sakshi News home page

హాకీ శిక్షణ శిబిరం ప్రారంభం

Aug 4 2016 12:40 AM | Updated on Sep 4 2017 7:40 AM

హాకీ శిక్షణ  శిబిరం ప్రారంభం

హాకీ శిక్షణ శిబిరం ప్రారంభం

ఆర్డీటీ స్టేడియంలో హాకీ శిక్షణ శిబిరం బుధవారం ప్రారంభమైంది. స్టిక్‌ ఫర్‌ ఇండియా రూపకర్త ఆండ్రూ ఎన్‌రిచ్, స్పెయిన్‌ వలంటీర్లు ఈ నెల 13వ తేదీ వరకు క్రీడాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు.

అనంతపురం స్పోర్ట్స్‌ : ఆర్డీటీ స్టేడియంలో హాకీ శిక్షణ  శిబిరం బుధవారం ప్రారంభమైంది. స్టిక్‌ ఫర్‌ ఇండియా రూపకర్త ఆండ్రూ ఎన్‌రిచ్, స్పెయిన్‌ వలంటీర్లు ఈ నెల 13వ తేదీ వరకు క్రీడాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎన్‌రిచ్‌ మాట్లాడుతూ జిల్లాలో హాకీని వాడవాడలా విస్తరింపజేస్తామన్నారు. అనంతరం స్పెయిన్‌ హాకీ కోచ్‌లు క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. హాకీ సంఘం కార్యదర్శి డాక్టర్‌ విజయబాబు, ఎస్కేయూ మాజీ వీసీ రామకృష్ణారెడ్డి, ఆర్డీటీ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ నిర్మల్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement