హ్యాండ్‌బాల్‌ టోర్నీ ప్రారంభం | handball tournament | Sakshi
Sakshi News home page

హ్యాండ్‌బాల్‌ టోర్నీ ప్రారంభం

Dec 18 2016 10:59 PM | Updated on Sep 4 2017 11:03 PM

హ్యాండ్‌బాల్‌ టోర్నీ ప్రారంభం

హ్యాండ్‌బాల్‌ టోర్నీ ప్రారంభం

కృష్ణా యూనివర్సిటీ అంతర్‌ కళాశాలల పురుషుల హ్యాండ్‌బాల్‌ టోర్నీ స్థానిక పీబీ సిద్ధార్థ కళాశాలలో ఆదివారం ప్రారంభమైంది. ఈ పోటీలను సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు ప్రారంభించారు.

విజయవాడ స్పోర్ట్స్‌ : కృష్ణా యూనివర్సిటీ అంతర్‌ కళాశాలల పురుషుల హ్యాండ్‌బాల్‌ టోర్నీ స్థానిక పీబీ సిద్ధార్థ కళాశాలలో ఆదివారం ప్రారంభమైంది. ఈ పోటీలను సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటగాళ్లు గెలవాలన్న తపనతోపాటు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు. లక్ష్యాలను నిర్దేశించుకుని నిత్యం సాధన చేసి రాణించాలన్నారు. పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.రమేష్, కళాశాల డైరెక్టర్‌ వేమూర్తి బాబురావు, ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.రవి, కృష్ణా యూనివర్సిటీ స్పోర్ట్స్‌ బోర్డు కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

తొలి రోజు ఫలితాలు : నాకౌట్‌ మ్యాచ్‌లో సప్తగిరి కళాశాల జట్టుపై 6-24 తేడాతో పీబీ సిద్ధార్థ కళాశాల జట్టు గెలుపొందింది. లీగ్‌ మ్యాచ్‌ల్లో శాతవాహన కళాశాల జట్టుపై 18-35 తేడాతో కేబీఎన్‌ కళాశాల జట్టు విజయం సాధించింది. ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల–పీబీ సిద్ధార్థ కళాశాల జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుండగా, లైట్‌ ఫెయిల్‌ కావడంతో రేపటికి వాయిదా వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement