
గుట్కాను స్వాధీనం చేసుకున్న కాశీబుగ్గ పోలీసులు
పలాస రైల్వేస్టేషన్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న సుమారు రూ.43 వేల విలువైన గుట్కాను కాశీబుగ్గ పోలీసులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. గత కొన్నేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి పలాస–కాశీబుగ్గ పట్టణంలో పలువురు వ్యాపారులు బరంపురం నుంచి వివిధ రైళ్లు, బస్సు మార్గాల ద్వారా అక్రమంగా గుట్కాను దిగుమతి చేసుకుంటున్నారు. ఇదే విషయమై ‘అక్రమంగా గుట్కా వ్యాపారం’ పేరుతో ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది.
పలాస : పలాస రైల్వేస్టేషన్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న సుమారు రూ.43 వేల విలువైన గుట్కాను కాశీబుగ్గ పోలీసులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. గత కొన్నేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి పలాస–కాశీబుగ్గ పట్టణంలో పలువురు వ్యాపారులు బరంపురం నుంచి వివిధ రైళ్లు, బస్సు మార్గాల ద్వారా అక్రమంగా గుట్కాను దిగుమతి చేసుకుంటున్నారు. ఇదే విషయమై ‘అక్రమంగా గుట్కా వ్యాపారం’ పేరుతో ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది.
ఈ నేపథ్యంలో పోలీసులు గుట్కా వ్యాపారులపై నిఘా పెట్టారు. నెహ్రూనగర్‌లోని అంబికా టింబర్ సమీపంలో ఒక గొడౌన్‌లో అక్రమంగా గుట్కాను నిల్వ చేసి ఉంచుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దృష్టి సారించారు. అలాగే రైల్వేస్టేషన్ నుంచి వస్తున్న సరుకులపైనా నిఘా ఉంచారు. బుధవారం కాశీబుగ్గ ఎల్‌సీ గేటు వద్ద పోలీసులు సరుకులను పరిశీలిస్తుండగా గుట్కా బస్తాలు బయటపడ్డాయి. వ్యాపారి పెద్దిన హరీష్‌ను అరెస్టు చేయడంతో పాటు గుట్కాను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.43 వేలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. గుట్కాను పట్టుకున్న వారిలో కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్, ఎస్‌ఐ బి.శ్రీరామ్మూర్తి, సిబ్బంది ఉన్నారు.