
తెరవెనుక మంటలు చెలరేగిన దృశ్యం
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మునిసిపాలిటీలోని రవిశంకర్ థియేటర్‌లో అఖండ సినిమా ప్రదర్శన సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. సినిమా కొనసాగుతుండగా తెర వెనుక ఉన్న సౌండ్ సిస్టమ్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు.