నవ్విస్తూ..ఆలోచింపజేస్తూ..

నవ్విస్తూ..ఆలోచింపజేస్తూ.. - Sakshi

విశాఖ–కల్చరల్‌ :  రంగసాయి థియేటర్‌ ఫెస్టివల్‌ అంగరంగð భవంగా సాగింది. రంగసాయి నాటక సంఘం 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కళాభారతి ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన విభిన్న అంశాల రంగస్థల ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సమాజంలో జరుగుతున్న పరిణామాలను అనుసరిస్తూ మంచిని చెప్తూ..కష్టాన్ని మరిపించే వినోదాత్మకమైన మంచిని ఆలోచింపజేసే వినూత్న రంగస్థల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 

అలరించిన ప్రదర్శనలు 

ప్రదర్శించిన ఆంధ్రశ్రీ అపర చాణుక్యుడు పెద్దాపురానికి చెందిన చల్లా పాపారావు ప్రదర్శించిన ఏకపాత్రాభినయంతో ఫెస్టివల్‌ ప్రారంభమైంది. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు గ్రహీత కోరుకొండ రంగరావు ప్రదర్శించిన ప్లాస్టిక్‌ భూతం విచిత్ర వేషధారణ,మిమిక్రీ ప్రేక్షకుల్ని నవ్వుల జల్లు కురిపించింది. విశాఖకు చెందిన నవర థియేటర్‌ ఆర్ట్స్‌ వారిచే ప్రదర్శించిన నటులున్నారు జాగ్రత్త అనే లఘునాటిక కళాత్మకంగా ప్రదర్శించారు. ప్రముఖ నంది అవార్డు గ్రహీత చలసాని కృష్ణప్రసాద్‌ దర్శకత్వంలో మధురవాడ వారిచే సుదర్శన కల్చరల్‌ అసోసియేషన్‌ ప్రదర్శించిన కన్యాశుల్కం ప్రవాసనం ప్రదర్శన విశేషంగా అలరించింది. నగరానికి చెందిన కేవీ మెమోరియల్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రంగస్థల నటుడు, దర్శకుడు పి. శివప్రసాద్‌ దర్శకత్వంలో స్వాగతం నాటిక ఆకట్టుకుంది. తర్వాత విజయనగరంచే వెయిట్‌లిఫ్టింగ్, చిన్నదాని సింగారం అనే అంశాలపై ఆదియ్య మాస్టారు సారధ్యంలో ముకాభినయం ప్రదర్శన కళాహదయాలను ఆకట్టుకుంది. ఆఖరిగా 65 మంది కళాకారులతో ఆరు నంది అవార్డులు అందుకున్న మహేశ్వరి ప్రసాద్‌ యంగ్‌ థియేటర్‌ ఆర్గనైజేషన్‌ విజయవాడ వారిచే ఎన్‌.ఎస్‌.నారాయణ రచనలో వాసు దర్శకత్వం వహించిన అశ్వరశరభ సాంఘిక నాటిక ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. 

ప్రేక్షకుల ఆదరణకు రుణపడి ఉంటా 

గత ఆరేళ్ల నుంచి 400లకు పైగా విభిన్న సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించామని నిర్వాహకుడు బాదంగీర్‌సాయి తెలిపారు. వందకుపైగా నాటిక, నాటకాలు తమ సంస్థ ద్వారా ప్రదర్శించడం జరిగిందని, మొట్టమొదటిగా ఈఏడాది రాష్ట్రప్రభుత్వ భాషా సాంస్కతిక శాఖ తరఫున ఆర్థికసాయంతో రంగసాయి ఫెస్టివల్‌ను చేపట్టామన్నారు. దీనికి ప్రభుత్వం అన్నివిధాల సహకరించినందుకు కతజ్ఞతలు తెలిపారు. 

ఘనంగా రంగసాయి ఆత్మీయ పురస్కారం ప్రదానం

రంగసాయి థియేటర్‌ ఫెస్టివల్‌–2016 సందర్భంగా గరికపాటి బాలగంగాధర తిలక్‌కు రంగసాయి ఆత్మీయ పురస్కారాన్ని అందజేశారు. తొలుత ఫెస్టివల్‌ మహోత్సవాన్ని కళాపోషకులు నిర్వహకులు రంగసాయి నాటక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బాదంగీర్‌సాయి, చలసాని కష్ణప్రసాద్, దుండు నాగేశ్వరరావు, శివజ్యోతి, కొణతాల రాజు, పి.శివప్రసాద్‌ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమం ఆద్యంతం సీనియర్‌ పాత్రికేయుడు ఎన్‌.నాగేశ్వరరావు వ్యాఖ్యతగా వ్యవహరించారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top