కర్నూలులోని ఎగ్జిబిషన్ ఆవరణలో ఇస్కాన్ ఆధ్యర్యంలో శ్రీజగన్నాధ రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు బలదేవి, సుభద్రదేవి సమేత జగన్నాథస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కర్నూలు(న్యూసిటీ) : కర్నూలులోని ఎగ్జిబిషన్ ఆవరణలో ఇస్కాన్ ఆధ్యర్యంలో శ్రీజగన్నాధ రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు బలదేవి, సుభద్రదేవి సమేత జగన్నాథస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నృసింహ, తులసి హారతులు ఇచ్చారు. సాయంకాలం 1008 ఆహార పదార్థాలతో అమ్మవార్లు స్వామికి నివేదన చేశారు. ఇస్కాన్ కర్నూలు ప్రాజెక్టు డైరెక్టర్ రూపేశ్వర్ చైతన్యదాస్, నరసరావుపేట ఇన్‌చార్జి వైష్ణవ ప్రభుదాస్, కర్నూలు ఇన్‌చార్జి చైతన్య చంద్ర ప్రతిదాస్ పాల్గొన్నారు.