హామీల అమలులో ప్రభుత్వం విఫలం | govt failure in promises implementation | Sakshi
Sakshi News home page

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

Sep 2 2016 11:39 PM | Updated on Mar 29 2019 9:31 PM

హామీల అమలులో ప్రభుత్వం విఫలం - Sakshi

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

తిప్పర్తి : ఎన్నికల హామీలను అమలు చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారతీయ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూధన్‌రెడ్డి ఆరోపించారు.

తిప్పర్తి : ఎన్నికల హామీలను అమలు చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారతీయ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూధన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు మాయమాటలు చెప్పి గద్దెను ఎక్కిన సీఎం కేసీఆర్‌ రుణమాఫీ చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. మూడవ విడత రుణమాఫీ అందని ద్రాక్షగానే మిగిలిందన్నారు. అనంతరం  సెప్టెంబర్‌–17న విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా  నిర్వహించాలని కోరుతూ స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వంగూరు రవి, జానయ్య, మహేశ్, శివ, రాజు, శాంతికుమార్, రమేష్, సురేష్, తదితరులున్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement