చేబర్తికి నిధుల మంజూరుపై హర్షం | Sakshi
Sakshi News home page

చేబర్తికి నిధుల మంజూరుపై హర్షం

Published Mon, Oct 3 2016 5:20 PM

సమావేశంలో మాట్లాడుతున్న అఖిలపక్షం నాయకులు

జగదేవ్‌పూర్‌: మండలంలోని చేబర్తి గ్రామంలో పలు అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కోట్లాది నిధులు మంజూరు చేయడం పట్ల సోమవారం గ్రామంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు నర్సింలుగౌడ్‌, రాందాస్‌గౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని చేబర్తి గ్రామం చాలా రోజులుగా అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు.

చెబర్తి పెద్ద చెరువు నుంచే కూడవెల్లి వాగు పుట్టిందని, కానీ చేబర్తి వాగుకు బదులు కూడవెల్లి వాగు అనడంతో గ్రామంలో అభివృద్ధి కూడా అంతగా లేదన్నారు. ఇటీవల మంత్రి హరీశ్‌రావు గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు కోట్లాది నిధులు మంజూరు చేశారని చెప్పారు. కూడవెల్లి వాగుకు బదులు పెద్దవాగుగా నామకరణం చేయడంతోపాటు చెరువు అభివృద్ధి కోటి రూపాయలు మంజూరు చేయడంతో వారు కృతజ్ఞతలు తెలిపారు.

మహిళా భవనం, ఫంక‌్షన్‌హాల్‌, బస్‌షెల్టర్‌, సీసీ రోడ్లు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం కోసం రూ.కోటికి పైగా నిధులు మంజూరు చేయడంతో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. అందరు కలిసికట్టుగా అభివృద్ధిలో భాగస్వాములవుతామని చెప్పారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు రాములు, మల్లేశం, గంగాధర్‌, చంద్రం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement