2న జిల్లా ర్యాపిడ్‌ చెస్‌ పోటీలు | from 2nd district rapid chess games | Sakshi
Sakshi News home page

2న జిల్లా ర్యాపిడ్‌ చెస్‌ పోటీలు

Mar 30 2017 6:45 PM | Updated on Sep 5 2017 7:30 AM

భీమవరం టౌన్‌ : భీమవరం డీఎన్నార్‌ కళాశాల రోడ్డులోని కిడ్జీ ప్లే స్కూల్లో ఏప్రిల్‌ 2వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా ర్యాపిడ్‌ చెస్‌ పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తోట భోగయ్య, కార్యదర్శి మాదాసు కిశోర్‌ గురువారం తెలిపారు.

 భీమవరం టౌన్‌ : భీమవరం డీఎన్నార్‌ కళాశాల రోడ్డులోని కిడ్జీ ప్లే స్కూల్లో ఏప్రిల్‌ 2వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా ర్యాపిడ్‌ చెస్‌ పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తోట భోగయ్య, కార్యదర్శి మాదాసు కిశోర్‌ గురువారం తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారై ఉండాలన్నారు. అభ్యర్థులు తమ ఆధార్‌కార్డు జిరాక్స్‌ కాపీని తీసుకురావాలన్నారు. ఈ పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారు అనంతపురం జిల్లాలో జూన్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి ర్యాపిడ్‌ చెస్‌ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు. వివరాలకు సెల్‌ : 90632 24466లో సంప్రదించాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement