బీసీ స్టడీ సర్కిల్‌లో ఎస్‌ఐ శారీరక దారుఢ్య పరీక్షల్లో ఆర్హత పొంది, రాత పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు డైరెక్టర్ రాములు తెలిపారు.
సిద్దిపేట జోన్: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ స్టడీ సర్కిల్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఎస్‌ఐ శారీరక దారుఢ్య పరీక్షల్లో ఆర్హత పొంది, రాత పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు తెలిపారు. నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులచే శిక్షణ ఇస్తారన్నారు. బీసీ సంక్షేమ శాఖ అదేశానుసారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా శిక్షన ఇస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగష్టు 3 వరకు ఆన్ లైన్లో tsbcstudycarcle. gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాల కోసం. సెల్ నం. 9985434941లో సంప్రదించాలన్నారు.