తెలంగాణ భాషను నిలిపేదే జానపద సాహిత్యం | Folklore saves telangana language | Sakshi
Sakshi News home page

తెలంగాణ భాషను నిలిపేదే జానపద సాహిత్యం

Published Sun, Jul 24 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

తెలంగాణ భాషను నిలిపేదే జానపద సాహిత్యం

తెలంగాణ భాషను నిలిపేదే జానపద సాహిత్యం

  • డాక్టర్‌ భాస్కరయోగి
  • హన్మకొండ కల్చరల్‌ : తెలంగాణ భాష, యాసను మహోన్నతంగా నిలిపేదే జానపద సాహిత్యమని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ పి.భాస్కరయోగి అన్నారు. వరంగల్‌లోని పోతన విజ్ఞానపీఠంలో శనివారం సాయంత్రం తెలంగాణ జానపద సాహిత్యంపై ప్రసంగం జరిగింది. నమిలికొండ నారాయణరావు స్మారకోపన్యాసంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పోతన విజ్ఞానపీఠం కార్యదర్శి నమిలికొండ బాలకిషన్‌రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భా స్కరయోగి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత అస్థిత్వాన్ని, సహజత్వాన్ని తెలిపేదే తెలంగాణ జానపద సాహిత్యమన్నారు. ఇక్కడి జానపదుల జనజీవనం, ఆచారాలు, పండుగలు, ఉత్సవాలు, నమ్మకాలు, శ్రామికజీవనం, కుటుంబవ్యవస్థ అన్నీ వారికి వస్తువులని తెలిపారు. తెలంగాణ జనజీవన lసంస్కృతి ఈ సాహిత్యంలో ప్రతిబింబిస్తుందన్నారు. ఇలాంటి సాహిత్యాన్ని భావితరాలకు అందించాలని కోరారు. అనంతరం దూపకుంట కాకతీయ కళాసమితి ఆధ్వర్యంలో జానపద గీతాలాపన నిర్వహించారు. కార్యక్రమంలో సాహితీవేత్త గన్నమరాజు గిరిజామనోహర్‌బాబు, కేయూ తెలుగుశాఖ ఆచార్య బన్న అయిలయ్య, నాగిళ్ల రామశాస్త్రి, ఆచార్య ఎంవీ  రంగారావు, వరిగొండ కాంతారావు, వీఆర్‌ విద్యార్థి, పల్లె నాగేశ్వర్‌రావు, పోతన విజ్ఞానపీఠం మేనేజర్‌ జేఎన్‌ శర్మ, కుందావజ్జుల కృష్ణమూర్తి, మారేడోజు సదానందచారి, మల్లికార్జున్, పాంచాలరాయ్, వీరాచారి, రఘురామయ్య, గోకులరాణి, బాలాజీ, శ్రీనివాసాచారి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement