స్పిల్‌వే గేట్ల నుంచి వరద నీరు | fllod water go to spill way | Sakshi
Sakshi News home page

స్పిల్‌వే గేట్ల నుంచి వరద నీరు

Jul 30 2016 11:28 PM | Updated on Aug 30 2019 8:19 PM

మధ్యమానేరు జలాశయం రివర్‌ స్లూయిస్‌ (బేస్మెట్‌ లెవల్‌ గేట్స్‌) నుంచి తొలిసారి వరదనీరు ప్రవహిస్తోంది. ప్రవాహం ఎక్కువైతే ఇక్కడి నుంచి వరదనీరు నేరుగా ఎల్‌ఎండీలోకి చేరే అవకాశం ఉంది.

బోయినపల్లి: మధ్యమానేరు జలాశయం రివర్‌ స్లూయిస్‌ (బేస్మెట్‌ లెవల్‌ గేట్స్‌) నుంచి తొలిసారి వరదనీరు ప్రవహిస్తోంది. ప్రవాహం ఎక్కువైతే ఇక్కడి నుంచి వరదనీరు నేరుగా ఎల్‌ఎండీలోకి చేరే అవకాశం ఉంది. మిడ్‌మానేరు జలాశయం నిర్మాణం జరుగక ముందు మూలవాగు వరదనీరు మానేరు మీదుగా ఎల్‌ఎండీలోకి చేరేది. ప్రస్తుతం జలాశయం నిర్మాణం పనులు జరుగుతుండగా వేములవాడ మూలవాగు, సిరిసిల్ల వాగుల నుంచి వస్తున్న వరదనీరు మానేరులోకి చేరుతోంది. స్పిల్‌వే బెడ్‌లెవల్‌లో ఏర్పాటు చేసిన నాలుగు గేట్ల నుంచి మూడు గేట్ల ద్వారా వరద నీరు ప్రవహిస్తున్నట్లు మిడ్‌మానేర్‌ డీఈఈ రాజు తెలిపారు. రిజర్వాయర్‌ స్పిల్‌వే నుంచి మొదటిసారిగా వరదనీరు ప్రవహిస్తుండడంతో  పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement