ఐదుగురు తమిళ కూలీల అరెస్ట్‌ | Five Tamil Labours Arest | Sakshi
Sakshi News home page

ఐదుగురు తమిళ కూలీల అరెస్ట్‌

Jan 16 2017 9:19 PM | Updated on Sep 5 2017 1:21 AM

ఐదుగురు తమిళ కూలీల అరెస్ట్‌

ఐదుగురు తమిళ కూలీల అరెస్ట్‌

అక్రమంగా ఎర్రచందనం రవాణా జరుగుతోందన్న సమాచారంతో మైదుకూరు రూరల్‌ సీఐ నాగభూషణం, ఖాజీపేట ఎస్‌ఐ రంగారావు దాడులు నిర్వహించారు.

ఖాజీపేట: అక్రమంగా ఎర్రచందనం రవాణా జరుగుతోందన్న సమాచారంతో మైదుకూరు రూరల్‌ సీఐ నాగభూషణం, ఖాజీపేట ఎస్‌ఐ రంగారావు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురు తమిళ కూలీలను అరెస్టు చేసి 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పుల్లూరు సమీపంలోని సెల్‌ టవర్‌ వద్ద తమిళ కూలీలు దుంగలను మోసుకుని పోతున్నట్లు ఆదివారం సాయంత్రం సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. అందులో సుమారు 197 కేజీల బరువుల గల 10 దుంగలను స్వాధీనం చేసుకుని ఐదుగురు తమిళకూలీలను అదుపులోకి తీసుకున్నారు. 10 దుంగల విలువ సుమారు రూ. 5లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకునే క్రమంలో పలువురు స్మగ్లర్లు తమపై దాడికి యత్నించారని  సీఐ తెలిపారు. పట్టుబడిన వారందరూ తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లా వారిగా పోలీసులు గుర్తించారు. ఆ మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement