జిల్లా లో ఐదు స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ మీనాక్షి మహాదేవన్ తెలిపారు.
జిల్లాలో ఐదు స్వైన్ ఫ్లూ కేసులు
Mar 1 2017 12:14 AM | Updated on Sep 5 2017 4:51 AM
చాగలమర్రి : జిల్లా లో ఐదు స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ మీనాక్షి మహాదేవన్ తెలిపారు. మంగళవారం స్థానిక మార్కెట్ కాలనీలోని సల్లా నర్సింగ్ హోంను ఆమె పరిశీలించారు. ప్రసాద్ నర్సింగ్ హోం నిర్వాహకులు స్కానింగ్ సెంటర్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇందుకు కావాల్సిన వసతులు, వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో వైద్యులు కొరత ఉందని, అన్ని పీహెచ్‌సీలకు వైద్యులను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రసాద్ నర్సింగ్ హోం వైద్యులు ప్రసాద్ ఉన్నారు.
Advertisement
Advertisement