కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సాయం | Financial assistance to the family of Constable | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సాయం

Aug 13 2016 11:38 PM | Updated on Mar 19 2019 5:52 PM

కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సాయం - Sakshi

కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సాయం

వరంగల్‌ రూరల్‌ పోలీస్‌ పరిధిలోని కురవి పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ఇటీవల రైలు ప్రమాదంలో మరణించిన బి.వెంకటయ్య (పీసీ–26020) కుటుంబానికి శనివారం రూరల్‌ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝూ ఆర్థికసాయం అందజేశారు.

వరంగల్‌ : వరంగల్‌ రూరల్‌ పోలీస్‌ పరిధిలోని కురవి పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ఇటీవల రైలు ప్రమాదంలో మరణించిన బి.వెంకటయ్య (పీసీ–26020) కుటుంబానికి శనివారం రూరల్‌ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝూ ఆర్థికసాయం అందజేశారు. చేయూత పథకంలో భాగంగా రూ.1.50 లక్షలు ఆయన భార్య యాకలక్ష్మికి అందించారు. ఈసందర్భంగా ఆయన వెంకటయ్య కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. దివంగత పోలీసుల పిల్లలు కష్టపడి చదవి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్‌ సంక్షేమ అధికారి ధరణీకుమార్, రూరల్‌ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శోభన్, వెంకటయ్య కుటంబ సభ్యులు ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement