పిల్లలతో సహా కానిస్టేబుల్ ఆత్మహత్య | father and sons suicide in krishna district | Sakshi
Sakshi News home page

పిల్లలతో సహా కానిస్టేబుల్ ఆత్మహత్య

Jul 30 2016 12:25 PM | Updated on Sep 17 2018 6:26 PM

పిల్లలతో సహా కానిస్టేబుల్ ఆత్మహత్య - Sakshi

పిల్లలతో సహా కానిస్టేబుల్ ఆత్మహత్య

తన ఇద్దరు పిల్లలతోపాటు తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

చల్లపల్లి : తన ఇద్దరు పిల్లలతోపాటు తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా చల్లపల్లిలో శుక్రవారం వెలుగు చూసింది. మోపిదేవి మండలం పెదప్రోలుకు చెందిన యదలపల్లి రమేష్ (38) అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఇతనికి కార్తీక్ (7), శ్రావ్య (4)  పిల్లలు ఉన్నారు. శుక్రవారం రాత్రి తన ఇద్దరు పిల్లలను బైక్పై ఎక్కించుకొని ఇంటి నుంచి వెళ్లిన రమేష్... ఇంటికి తిరిగి రాలేదు. దాంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు.

దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం కోడూరు మండలం సాగరసంగమం వద్ద రమేష్ బైక్ను పోలీసులు గుర్తించారు. దీంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సముద్ర తీరంలో రమేష్, శ్రావ్యల మృతదేహాలు లభించాయి. కార్తీక్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే రమేష్ పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement