అన్నదాత ఆత్మహత్య | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

అన్నదాత ఆత్మహత్య

Jun 23 2016 3:40 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పులబాధ తాళలేక రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

చెన్నారావుపేట (వరంగల్) : అప్పులబాధ తాళలేక రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ఖల్‌నాయక్‌తండాలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన గుగులోత్ కోబ్లా(65) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా.. పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఎక్కువయ్యాయి. వాటిని తీర్చే దారి కనపడక గురువారం వ్యవసాయ బావి వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement