నకిలీ ధ్రువపత్రంతో టీచర్ ఉద్యోగం


శ్రీకాకుళం: జిల్లాలో ఇటీవల భర్తీ చేసిన డీఎస్సీ-14లో ఎస్‌జీటీ కేటగిరీ నుంచి ఉద్యోగం పొందిన ఓ అభ్యర్థి నకిలీ ధ్రువపత్రం సమర్పించారని, మరో అభ్యర్థి జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేశారు. కింతలి అన్నపూర్ణ అనే అభ్యర్థి తనకు అంధత్వం ఉన్నట్టు ధ్రువీకరణపత్రం జతచేసి ఉద్యోగం పొందిందని కూర్మాపు మీన ఫిర్యాదులు పేర్కొంది. 2012లో ఇదే అభ్యర్థి మెదక్ జిల్లా నుంచి డీఎస్సీ పరీక్ష రాసినప్పుడు బీసీ-ఎ జనరల్ అభ్యర్థిగా పరీక్ష రాశారని, 2014 డీఎస్సీ సరికి వికలాంగ ధ్రువీకరణ పత్రంతో ఎలా పరీక్ష రాశారన్నదానిపై విచారణ జరపాలని ఫిర్యాదులో కోరారు. ఈ వికలాంగురాలి పత్రం నకిలీదని తేలిస్తే డి.జయశ్రీ అనే నిజమైన వికలాంగురాలు ఉద్యోగం పొందుతుందని తెలిపారు. దీనిపై అధికారులు లోతైన దర్యాప్తు జరిపిస్తే ఫిర్యాదు వాస్తవమా, కాదా అన్నది తేటతెల్లమయ్యే అవకాశాలున్నాయి.

 

 ముస్లిం మైనారిటీ అభ్యర్థుల ఫిర్యాదు

 ఇదిలా ఉంటే ఓ ఇద్దరు ముస్లిం మైనారిటీ అభ్యర్థులు ఇటీవల కలెక్టర్‌కు ఓ ఫిర్యాదు చేశారు. తాము బీసీ-ఇ కేటగిరీకి చెందినవారమని, పొరపాటునో, మరో కారణంగానో బీసీ-బిగా నమోదైందని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ తహసీల్దార్ ద్వారా విచారణ చేరుుంచి, ఇద్దరు అభ్యర్థులు బీసీ-ఇ కేటగిరీకి చెందినవారుగా నిర్ధారించారు. వీరికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణరుుంచి, అంతకుముందు బీసీ-ఇ కేటగిరీ నుంచి ఎంపిక చేసిన ఇద్దరు అభ్యర్థులను తప్పించాలని ఆదేశించారు.

 

 అయితే, వీరిద్దరు కూడా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ తమ స్థానాల్లో ఉద్యోగం ఇవ్వాలని చూస్తున్న అభ్యర్థులు బీసీ-ఇ కేటగిరీకి చెందినవారు కాదని ఆరోపించారు. దీంతో అధికారులు ఈ విషయంపై విచారణ జరిపించేందుకు డీఆర్‌ఓకు నివేదించారు. డీఆర్‌ఓ నుంచి నివేదిక అందిన తరువాత ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి వద్ద సాక్షి ప్రస్తావించగా ఫిర్యాదు అందినమాట వాస్తవమేనన్నారు. అయితే రిఫరల్ ఆస్పత్రి నుంచి కూడా 40 శాతం అంగవైకల్యంతో ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవడం వల్ల ఉద్యోగం ఇచ్చారని తెలిపారు. మైనారిటీల విషయమై డీఆర్‌ఓకు నివేదించినట్టు చెప్పారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top