నల్లగొండ జిల్లా నారాయణపురం మండలంలో బుధవారం రాత్రి పోలీసులు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను పట్టుకున్నారు.
నల్లగొండ: నల్లగొండ జిల్లా నారాయణపురం మండలంలో బుధవారం రాత్రి పోలీసులు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. మండలంలోని మహ్మదాబాద్ గ్రామంలో లక్ష్మారెడ్డి పౌల్ట్రీలో సోదా చేయగా నాలుగు బస్తాల అమ్మోనియం నైట్రేట్, జిలెటిన్ స్టిక్స్, విద్యుత్ తీగ లభించాయి.
ఇవి చిట్యాలకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే రైతుకు చెందినవిగా భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. త్వరలో ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇవి వెలుగులోకి రావటం గమనార్హం.