ప్రశాంతంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్ష
నల్లగొండ క్రైం: ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్ పరీక్షలు ఆదివారం జిల్లాలోని నల్లగొండ, భువనగిరి, పోచంపల్లిలోని 71 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి.
నల్లగొండ క్రైం: ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్ పరీక్షలు ఆదివారం జిల్లాలోని నల్లగొండ, భువనగిరి, పోచంపల్లిలోని 71 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 30,244 మంది అభ్యర్థులకు గాను 24,759 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా 5,485 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తంగా 82 శాతం మంది పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షను నిర్వహించారు. నల్లగొండలోని ఎన్జీ కాలేజీ పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన ఐదుగురు అభ్యర్థులను వెనక్కి పంపారు. జిల్లా కేంద్రంతో పాటు భువనగిరి పట్టణంలోని పరీక్షా కేంద్రాలను టీఎస్‌పీఎస్సీ సభ్యుడు మతీనుద్దీన్ ఖాద్రీ పరిశీలించారు. అదే విధంగా జిల్లా కేంద్రంలో జేసీ సత్యనారాయణ, ఏజేసీ వెంకట్రావు, డీఆర్‌ఓ రవినాయక్, ఆర్డీఓ వెంకటాచారి, డీఈఓ మధుసూదన్‌లు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.