పరీక్షిస్తున్న భానుడు | examing bhanudu | Sakshi
Sakshi News home page

పరీక్షిస్తున్న భానుడు

Mar 25 2017 9:55 PM | Updated on Sep 5 2017 7:04 AM

పరీక్షిస్తున్న భానుడు

పరీక్షిస్తున్న భానుడు

నరసాపురం రూరల్‌: పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ఒత్తిడితో పాటు పెరుగుతున్న ఎండలు కూడా సమస్యగా మారాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్ష రాసిన అనంతరం విద్యార్థులు మండుటెండలో ఆపసోపాలు పడుతూ ఇళ్లకు చేరుకోవాల్సి వస్తోంది.

 నరసాపురం రూరల్‌: పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ఒత్తిడితో పాటు పెరుగుతున్న ఎండలు కూడా సమస్యగా మారాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు  పెరుగుతున్న నేపథ్యంలో పరీక్ష రాసిన అనంతరం విద్యార్థులు మండుటెండలో ఆపసోపాలు పడుతూ ఇళ్లకు చేరుకోవాల్సి వస్తోంది. విద్యార్థులను దూర ప్రాంతాల పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కాలినడకన, సైకిల్‌పై పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థులు అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. దీనికి తోడు కొన్ని పరీక్ష కేం‍ద్రాల్లో మంచి నీటి వసతి కూడా లేకపోవడంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement