'ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే ఏం చేస్తున్నారు' | errabelli dayakar questioned trs party on almatti | Sakshi
Sakshi News home page

'ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే ఏం చేస్తున్నారు'

Aug 14 2015 6:59 PM | Updated on Jul 11 2019 7:38 PM

టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ అధికార టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు.

హైదరాబాద్: టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ అధికార టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఎగువున ఉన్న కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును పెంచుతుంటే ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆల్మట్టి ఎత్తు ఐదు మీటర్లు పెరిగితే తెలంగాణకు చుక్కరాదు అని ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ నిర్వాకం వల్లే మహారాష్ట్ర బాబ్లీపై 24 24 అక్రమ ప్రాజెక్టులు నిర్మించిందని అన్నారు. టీడీపీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, పాత ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలనేదే టీడీపీ విధానం అని ఎర్రబెల్లి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement