డైజీ రికార్డింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి | effort for daiji recording center establish | Sakshi
Sakshi News home page

డైజీ రికార్డింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి

Jan 4 2017 11:26 PM | Updated on Aug 9 2018 8:15 PM

డైజీ రికార్డింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి - Sakshi

డైజీ రికార్డింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి

దివ్యాంగుల కోసం జిల్లాలో డైజీ రికార్డింగ్‌ సెంటర్‌కు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు.

– ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంలో ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు(అర్బన్‌): దివ్యాంగుల కోసం జిల్లాలో డైజీ రికార్డింగ్‌ సెంటర్‌కు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. బుధవారం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా కర్నూలులోని అంధుల శిక్షణాభివృద్ధి కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. సమాఖ్య అధ్యక్షుడు ఎస్‌. పుష్పరాజ్‌ అద్యక్షతన జరిగిన  కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా లూయిస్‌ బ్రెయిలీ జన్మదిన వేడుకలకు తాను హాజరవుతున్నానన్నారు. అంధుల సమాఖ్య తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో పాటు సోషల్‌ జస్టిస్‌ మంత్రితో కూడా చర్చించి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జిల్లాకు సెన్సరీ పార్కు మంజూరు చేశామన్నారు.
 
        వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పథకాలన్నింటిని గ్రామ స్థాయి వరకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.  అంధుల సమాఖ్య కార్యాలయ స్థలం కోసం పోరాడతానని  చాంబర్‌ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు విజయకుమార్‌రెడ్డి  అన్నారు. మోడరన్‌ ఐ హాస్పిటల్‌ ఎండీ డాక్టర్‌ రాజశేఖర్‌ మాట్లాడుతు , రోటరీ క్లబ్‌ న్యూసిటీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు , అంధుల సమాఖ్య జాతీయ కార్యదర్శి విశ్వనాథరెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి. అనీల్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. సుబ్రమణ్యం, కేవీఆర్‌ డిగ్రీ కళాశాల అధ్యాపకులు బి. ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement