సాంకేతికలోపంతో నిలిచిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ | east coast express train stopped due to technical issues | Sakshi
Sakshi News home page

సాంకేతికలోపంతో నిలిచిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్

Sep 8 2015 4:39 PM | Updated on Sep 3 2017 9:00 AM

సాంకేతిక లోపాలు తలెత్తి ఓ ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోవడంతో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది.

వరంగల్ : సాంకేతిక లోపాలు తలెత్తి ఓ ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోవడంతో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. వరంగల్ జిల్లాలోని కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపానికి రాగానే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో అక్కడే నిలిచిపోయింది. దీంతో ఈ మార్గంలో వెళ్లవలసిన పలు రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల నుంచి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎక్స్ప్రెస్ రైలులో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement