మార్కెట్‌.. ఇక వైఫై జోన్‌ | E-nam mahaboobnagar market yard free wifi zone | Sakshi
Sakshi News home page

మార్కెట్‌.. ఇక వైఫై జోన్‌

Sep 5 2017 9:03 AM | Updated on Oct 8 2018 5:07 PM

మార్కెట్‌.. ఇక వైఫై జోన్‌ - Sakshi

మార్కెట్‌.. ఇక వైఫై జోన్‌

మహబూబ్‌నగర్‌ మార్కెట్‌ యార్డ్‌ ప్రాంతాన్ని త్వరలోనే ఫ్రీ వై ఫై జోన్‌గా మార్చనున్నట్లు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెరుకుపల్లి రాజేశ్వర్‌ తెలిపారు.

ఈ–నామ్‌ అమలుకు ఆమోదం
రూ.41లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం
కమిటీ సమావేశంలో పలు తీర్మానాలు


జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): మహబూబ్‌నగర్‌ మార్కెట్‌ యార్డ్‌ ప్రాంతాన్ని త్వరలోనే ఫ్రీ వై ఫై జోన్‌గా మార్చనున్నట్లు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెరుకుపల్లి రాజేశ్వర్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డ్‌లో కమిటీ సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో రైతులకు మేలు జరిగేలా ఈ–నామ్‌ విధానాన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు ఉద్యోగులు, వ్యాపారులు కృషి చేయా లని తీర్మానించా రు. అనంతరం కమిటీ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు, తీసుకున్న నిర్ణయాలను చైర్మన్‌ వెల్లడించారు.

నిజామాబాద్‌ ఆదర్శం
నిజామాబాద్‌ మార్కెట్‌ను ఆదర్శంగా తీసుకుని పాలమూరు మార్కెట్‌లో కూడా ఈ–నామ్‌ విధానంలో కొనుగోళ్లు, అమ్మకాలు చేపట్టాలని తీర్మానించినట్లు చైర్మన్‌ రాజేశ్వర్‌ వెల్లడించారు. తూకాల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలకు చెక్‌ పెట్టెందుకు›‘వై ఫై’ టవర్లు ఏర్పాటు చేయడం ద్వారా వై ఫై జోన్‌గా మారుస్తామని తెలిపారు. అలాగే, రాబోయే మూడు నెలల్లో రూ.41లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. తాగునీటి వసతి కోసం వాటర్‌ ట్యాంకు, మహిళా రైతులు, సిబ్బందికి ప్రత్యేకంగా మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు నిర్మించాలని, ప్రహరీ గోడ నిర్మాణాలు చేపట్టాలని తీర్మానించామన్నారు. వైస్‌ చైర్మన్‌ బాలరాజు, డైరెక్టర్లు కొప్పుల శ్రీనివాస్, కుర్వ శ్రీనివాసులు, బి.శ్రీనివాసులు, అల్తాఫ్, రవీందర్‌రెడ్డి, ప్రత్యేక శ్రేణి కార్యదర్శి నూర్జహాన్‌ బేగం, గ్రేడ్‌–2 కార్యదర్శి నవీన్‌ పాల్గొన్నారు.

డెంగ్యూతో చికిత్స పొందుతున్న బాలిక
జడ్చర్ల టౌన్‌: బాదేపల్లి ఎస్‌వీపీ నగర్‌కు చెందిన ఓ బాలిక డెంగ్యూ లక్షణాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కొద్ది రోజుల క్రితం జ్వరం రాగా స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చూపించారు. అ యితే బాలికకు డెంగ్యూలక్షణాలు ఉండటంతో హైదరాబాద్‌ పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement