రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి | drowned from train.. passenger dead | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

Aug 23 2016 10:19 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఏలూరు (సెంట్రల్‌) : రైలు నుంచి జారిపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.

ఏలూరు (సెంట్రల్‌) : రైలు నుంచి జారిపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. భీమడోలు రైల్వేస్టేషన్‌ సమీపంలో సుమారు 40 ఏళ్ల వయస్సు గల ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు.  మృతుడు ఎత్తు 5.6 అడుగులు ఉండి బ్లూ కలర్‌ షర్టు, జీన్‌ ఫ్యాంటు ధరించి ఉన్నాడని, వివరాలు తెలిసిన వారు 9440627572, 08812– 231006 నంబర్లకు ఫోన్‌ చేసి తెలియజేయాలని కోరారు. హెడ్‌కానిస్టేబుల్‌ జి.నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement